English | Telugu

త‌గ్గేదేలే అంటున్న పూజ‌.. ఆ ఒక్క పాట‌కి రూ.1 కోటి పారితోషికమా!?

తెలుగునాట హ‌వా సాగిస్తున్న క‌థానాయిక‌ల్లో పూజా హెగ్డే ఒక‌రు. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా కెరీర్ లో దూసుకుపోతోందీ బుట్ట‌బొమ్మ‌. ఒక‌వైపు క‌థానాయిక‌గా అల‌రిస్తూనే.. మ‌రోవైపు అతిథి త‌ర‌హా పాత్ర‌ల్లోనూ, ప్ర‌త్యేక గీతాల్లోనూ ఎంట‌ర్టైన్ చేస్తోంది పూజ‌.

ఇదిలా ఉంటే, `రంగ‌స్థ‌లం` (2018) త‌రువాత మ‌ళ్ళీ ఐట‌మ్ సాంగ్స్ జోలికి వెళ్ళ‌ని పూజ‌.. `ఎఫ్ 3`లో స్పెష‌ల్ గా చిందులేయ‌బోతున్న‌ట్లుగా తాజాగా ప్ర‌చారం ఊపందుకుంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఈ ప్ర‌త్యేక గీతం కోసం పూజా హెగ్డే అక్ష‌రాలా రూ. 1 కోటి పారితోషికం అందుకోనుంద‌ట‌. వాస్త‌వానికి, రూ. 1.25 కోట్ల మొత్తం డిమాండ్ చేసింద‌ట అమ్మ‌డు. అయితే, ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మాణంలో ఇప్ప‌టికే `డీజే` (2017), `మ‌హ‌ర్షి` (2019) చిత్రాలు చేసిన నేప‌థ్యంలో.. ఆ అనుబంధం రీత్యా రూ. 1 కోటికి ఫిక్స‌యింద‌ని టాక్. ఏదేమైనా.. ఒక్క పాట కోసం రూ. 1 కోటి రెమ్యూన‌రేష‌న్ అంటే కచ్చితంగా టాక్ ఆఫ్ ఇండ‌స్ట్రీనే. మ‌రి.. `ఎఫ్ 3`లో పూజ స్పెష‌ల్ సాంగ్ పై వ‌స్తున్న క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

కాగా, అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న `ఎఫ్ 3`లో విక్ట‌రీ వెంక‌టేశ్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, స్ట‌న్నింగ్ బ్యూటీ మెహ్రీన్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వేస‌వి కానుక‌గా మే 27న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జ‌నం ముందుకు రానుంది