English | Telugu

సామ్ తో మైత్రీ వారి ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్!

హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ కి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో చెన్నైపొన్ను స‌మంత ఒక‌రు. మైత్రీ నిర్మించిన‌ `జ‌న‌తా గ్యారేజ్` (2016), `రంగ‌స్థ‌లం` (2018) చిత్రాల్లో మెయిన్ లీడ్ గా ఎంట‌ర్టైన్ చేసిన సామ్.. ఆపై అదే సంస్థ ప్రొడ్యూస్ చేసిన `పుష్ప - ద రైజ్` (2021) కోసం ``ఊ అంటావా మామా`` అంటూ సాగే ప్ర‌త్యేక గీతంలో త‌న చిందుల‌తో క‌నువిందు చేసింది. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో మైత్రీ, సామ్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతోంద‌ని బ‌జ్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. రీసెంట్ గా `శాకుంత‌లం` అనే పాన్ - ఇండియా ఫిమేల్ సెంట్రిక్ మూవీని పూర్తి చేసిన సమంత‌.. ప్ర‌స్తుతం `య‌శోద‌` అనే మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో న‌టిస్తోంది. ఇది కూడా పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గానే సంద‌డి చేయ‌నుంది. అంతేకాదు.. `య‌శోద‌` పూర్త‌య్యేలోపే మ‌రో నాయికా ప్రాధాన్య చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట స‌మంత‌. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌బోతోంద‌ట‌. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడు, ఇత‌ర వివ‌రాలు వెలువ‌డే అవ‌కాశ‌ముందంటున్నారు. మ‌రి.. సమంత‌, మైత్రీ కాంబినేష‌న్ లో మ‌రో హిట్ క్రెడిట్ అవుతుందేమో చూడాలి.