Read more!

English | Telugu

ఆ హీరోయిన్ భోజనం ఖర్చు 35వేలే


చూడటానికి, సన్నగా నాజుగ్గా ఉండే హీరోయిన్లు అలా ఉండటానికి అసలు భోజనం చేస్తారా అని అనుమానం కలుగుతుంది. లేదా వారి ఆహార రహస్యం ఏం అయి ఉంటుందో అని ఆసక్తి అయినా చాలామందిలో ఉంటూనే ఉంటుంది. అయితే అలాంటి నాజుకు చిన్నది, టాప్ హీరోయిన్, టాలీవుడ్ లక్కీచార్మ్ గర్ల్స్‌లో ఒకరైన సమంత రోజుకి కేవలం 35 వేలు విలువ చేసే ఫుడ్ మాత్రమే తింటుందట. మీరు చదివింది నిజమే. నమ్మడానికి వీలు లేకున్నా ఆవిడ రోజుకి తినే ఫుడ్ ఖరీదు 35 వేలట. ఈ విషయం  ఆ బిల్లు పే చేస్తున్న నిర్మాతలు ఎవరైనా బల్లగుద్దీ మరీ చెబుతున్నారట.


అయితే ఈ నాజుకు భామ తిండి ఖర్చు ఇంతగా ఎందుకు పేలిపోతుందంటే, ఈ మధ్య ఒకసారి మన హీరోయిన్ గారికి బయట ఫుడ్ తినడం వల్ల ఎలర్జీ సోకిందట. దాని వల్ల షూటింగ్‌లు కూడా మానుకోవలసి వచ్చింది. ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటోంది సమంత. బయటి ఫుడ్ తినకుండా, షూటింగ్ ఎక్కడ జరిగినా వంట వాళ్ళని కూడా తీసుకు వెళ్తోందట. వారితో నచ్చింది శుచిగా వండించుకొని తింటోందిట. అలా సమంత ఇంటి వంట కోసం కోలీవుడ్, టాలీవుడ్ వాళ్ళు రోజుకి 35 వేల వరకు ఖర్చు చేయవలసి వస్తోందిట. టాప్‌లో ఉన్నప్పుడు హీరోయిన్ ఖర్చులు ఎంత భారమైనా నిర్మాతలు మోయక తప్పదు.