English | Telugu

'జనతా గ్యారేజ్' హిందీ రీమేక్ లో సల్మాన్‌ ఖాన్‌!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా జనతా గ్యారేజ్. సమంత, నిత్యా మీనన్‌ హీరోయిన్లుగా నటించగా.. మోహన్‌ లాల్‌ కీలక పాత్ర పోషించారు. 2016 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్‌ లో రీమేక్‌ చేయన్నునారని టాక్ వినిపిస్తోంది.

'జనతా గ్యారేజ్' హిందీ రీమేక్ కు బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే సల్మాన్ కు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకున్నారట. ప్రస్తుతం దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలోనే ఈ అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

కాగా గతంలో సల్మాన్.. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన పలు సినిమాలను హిందీలో రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. పోకిరి, రెడీ, కిక్ వంటి సూపర్ హిట్ తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసి సాలిడ్ హిట్స్ అందుకున్న సల్మాన్.. జనతా గ్యారేజ్ రీమేక్ తో మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి.