English | Telugu

పవన్ కళ్యాణ్ దర్శకుడితో విశ్వక్ సేన్.. టైటిల్ ఏంటో తెలుసా..?

పవన్ కళ్యాణ్ దర్శకుడితో విశ్వక్ సేన్.. టైటిల్ ఏంటో తెలుసా..?

 

ఈ ఫిబ్రవరి 14న 'లైలా' (Laila) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఇదిలా ఉంటే, షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో మరో సినిమా చేయడానికి విశ్వక్ సేన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి 'భీమ్లా నాయక్' ఫేమ్ సాగర్ కె చంద్ర (Sagar K Chandra) దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

 

'అయ్యారే', 'అప్పట్లో ఒకడుండేవాడు' వంటి సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర.. 'భీమ్లా నాయక్‌' సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'టైసన్ నాయుడు' అనే సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ప్రాజెక్ట్ కోసం విశ్వక్ సేన్ తో చేతులు కలుపుతున్నారు సాగర్ కె చంద్ర. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే కథ అని తెలుస్తోంది. సాహు గారపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి 'జిత్తు పటేల్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.