English | Telugu

శివ కార్తికేయ‌న్ తో రీతూ వ‌ర్మ రొమాన్స్!

స‌హాయ న‌టిగా కెరీర్ ఆరంభించి.. ఆన‌క క‌థానాయిక‌గా ఎదిగిన వైనం రీతూ వ‌ర్మ సొంతం. `పెళ్ళి చూపులు` చిత్రంతో సోలో హీరోయిన్ గా స‌క్సెస్ చూడ‌డ‌మే కాకుండా.. `ఉత్త‌మ న‌టి`గా `నంది` పుర‌స్కారాన్ని సైతం త‌న కైవ‌సం చేసుకుందీ టాలెంటెడ్ యాక్ట్ర‌స్. అంతేకాదు.. తెలుగుతో పాటు త‌మిళంలోనూ న‌టిగా త‌న‌దైన ముద్ర వేస్తోంది రీతూ వ‌ర్మ‌. ఇటీవ‌ల `ట‌క్ జ‌గ‌దీశ్`, `వ‌రుడు కావ‌లెను` సినిమాల్లో ఆక‌ట్టుకున్న రీతూ.. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `ఒకే ఒక జీవితం`లో మెయిన్ లీడ్ గా న‌టిస్తోంది. అలాగే, చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చియాన్ విక్ర‌మ్ - గౌత‌మ్ మీన‌న్ కాంబో మూవీ `ధ్రువ న‌క్ష‌త్రం`లోనూ త‌నే హీరోయిన్.

ఇదిలా ఉంటే.. తాజాగా రీతూ వ‌ర్మ‌ని మ‌రో క్రేజీ ఆఫ‌ర్ వ‌రించింద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `జాతిర‌త్నాలు`తో ఈ ఏడాది ఆరంభంలో ఘ‌న‌విజ‌యం అందుకున్న యువ ద‌ర్శ‌కుడు అనుదీప్.. త్వ‌ర‌లో కోలీవుడ్ యంగ్ స్టార్ శివ కార్తికేయ‌న్ తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ సినిమాని రూపొందించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో శివ కార్తికేయ‌న్ కి జంట‌గా రీతూ వ‌ర్మ‌ని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానున్న‌ది. మ‌రి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తో రీతూ స్థాయి మ‌రింత‌గా పెరుగుతుందేమో చూడాలి.