English | Telugu

క‌మ‌ల్ కి జోడీగా త‌మ‌న్నా?

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవికి జంట‌గా `భోళా శంక‌ర్`, విక్ట‌రీ వెంక‌టేశ్ కి జోడీగా `ఎఫ్ 3` చేస్తున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. త్వ‌ర‌లో మ‌రో సీనియ‌ర్ హీరో స‌ర‌స‌న సంద‌డి చేయ‌నుంద‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. 1996 నాటి బాక్సాఫీస్ సెన్సేష‌న్ `ఇండియ‌న్` (తెలుగులో `భార‌తీయుడు` పేరుతో అనువాద‌మైంది)కి సీక్వెల్ గా `ఇండియ‌న్ 2` పేరుతో క‌మ‌ల్ హాస‌న్ - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొంత‌మేర చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి.. కొన్ని కార‌ణాల వ‌ల్ల బ్రేక్ ప‌డింది. ఎట్టకేల‌కు.. ఈ భారీ బ‌డ్జెట్ మూవీ మ‌ళ్ళీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. కాగా, తొలుత ఈ చిత్రం కోసం టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ని నాయిక‌గా ఎంపిక చేసిన చిత్ర బృందం.. ఇప్పుడామె స్థానంలో త‌మ‌న్నాని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ప్రెగ్నెన్సీ కార‌ణంగానే కాజ‌ల్ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంద‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే `ఇండియ‌న్ 2`లో త‌మ‌న్నా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి.. అటు క‌మ‌ల్ తోనూ, ఇటు శంక‌ర్ తోనూ తొలిసారిగా జ‌ట్టుక‌ట్ట‌నున్న త‌మ‌న్నా.. ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.