English | Telugu

బోయ‌పాటి కోసం బ‌న్నీ ద్విపాత్రాభిన‌యం?

ఒక‌వైపు త‌న తాజా చిత్రం `అఖండ‌`తో థియేట‌ర్స్ లో మాస్ జాత‌ర చేయిస్తున్నారు మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను. మ‌రోవైపు.. ``త‌గ్గేదేలే`` అంటూ మ‌రో ప‌ది రోజుల్లో మాస్ పార్టీ ఇచ్చేందుకు `పుష్ప‌`తో సిద్ధ‌మ‌య్యారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కాగా, `మాస్` మంత్రం జ‌పిస్తున్న ఈ ఇద్ద‌రు త్వ‌ర‌లో మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

బ‌న్నీతో ప్ర‌భాస్ ద‌ర్శ‌కుడి పాన్ - ఇండియా మూవీ?

`స‌రైనోడు` (2016) వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత దాదాపు ఆరేళ్ళ విరామంతో బ‌న్నీ, బోయ‌పాటి కాంబోలో రాబోతున్న ఈ సినిమా.. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని స‌మాచారం. అంతేకాదు.. ఇందులో బ‌న్నీ తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఒక పాత్ర ఊర‌మాస్ గానూ.. మ‌రో పాత్ర ప‌క్కా క్లాస్ గానూ ఉంటుంద‌ని టాక్. అలాగే, `స‌రైనోడు`కి స్వ‌రాలు అందించిన యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా బాణీలు అందించబోతున్న‌ట్లు వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే బ‌న్నీ - బోయ‌పాటి సెకండ్ జాయింట్ వెంచ‌ర్ కి సంబంధించి మ‌రింత స్ప‌ష్ట‌త రానుంది.

'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్.. తగ్గేదేలే!

మ‌రి.. `స‌రైనోడు` త‌రువాత రాబోతున్న ఈ సినిమాతోనూ బ‌న్నీ - బోయ‌పాటి కాంబినేష‌న్ సంచ‌ల‌నం సృష్టిస్తుందేమో చూడాలి.