English | Telugu

సిద్దార్థ్ తో సమంత న్యూమూవీ

సిద్దార్థ్‌, స‌మంత..చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. జ‌బ‌ర్ ద‌స్త్‌తో సినిమాతో చిగురించిన వీరి ప్రమాయణం ఇంకా కొనసాగుతూనే వుంది. సమంత కూడా అనేక సార్లు సిద్దూతో ల‌వ్‌లో ఉన్నాన‌ని హింట్ ఇచ్చేసింది కానీ డైరెక్ట్ గా చెప్పలేదు. జ‌బ‌ర్ ద‌స్త్‌తో వెండితెరపై కనిపించిన ఈ జంట, ఆతరువాత కలిసి నటించలేదు. అయితే ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ జోడీ క‌ట్ట‌బోతున్నార‌ని టాలీవుడ్ టాక్‌. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన బెంగ‌ళూర్ డేస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో సిద్దూ, స‌మంత మ‌రోసారి రొమాన్స్ చేయ‌బోతున్నారు. నిజ జీవిత ప్రేమ జంట‌ని తెర‌పై చూపిస్తే.. ఆ కిక్కే వేరు. సినిమాకి ఎగ‌స్ట్రా మైలేజ్ కూడా. అందుకే.. సిద్దూ, స‌మంత‌ల‌ను ఎంచుకొన్నార‌ని తెలుస్తోంది.