English | Telugu
వెబ్ సిరీస్ లో రామ్ చరణ్.. నెట్ ఫ్లిక్స్ తో బిగ్ డీల్!
Updated : Feb 15, 2022
టాలీవుడ్ స్టార్స్ ఓటీటీలలో సందడి చేస్తున్నారు. షోలు, సిరీస్ లతో అలరిస్తున్నారు. ఇప్పటికే సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్ తో ఆకట్టుకోగా.. వెంకటేష్, రానా, నాగ చైతన్య వంటి స్టార్స్ సిరీస్ లతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ భారీ వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడని తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓ అమెరికన్ వెబ్ సిరీస్ ని భారతీయ ప్రేక్షకుల కోసం రీమేక్ చేసే సన్నాహాల్లో ఉందట. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో విడుదల కానున్న ఈ సిరీస్ కోసం మొదట బాలీవుడ్ స్టార్ ని తీసుకోవాలని భావించారట. అయితే చరణ్ కి సౌత్ లో మంచి గుర్తింపు ఉండటం, అలాగే త్వరలో 'ఆర్ఆర్ఆర్'తో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉండటంతో.. నెట్ ఫ్లిక్స్ చరణ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. చరణ్ కూడా ఈ సిరీస్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఈ సిరీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని, ఈ సిరీస్ కోసం నెట్ ఫ్లిక్స్ చరణ్ కి భారీగా ఆఫర్ చేసిందనిసమాచారం.
కాగా, రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న చరణ్.. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేయనున్నాడు.