English | Telugu
బాలయ్యతో రాయ్ లక్ష్మి చిందులు?
Updated : May 31, 2021
`అఖండ`.. నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం. `సింహా` (2010), `లెజెండ్` (2014) వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత `మాస్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్` బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో `అఖండ`పై స్కై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టే.. ఫస్ట్ రోర్, టైటిల్ రోర్ వీడియోలు యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అతనికి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కథానుసారం ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతానికి స్థానముందట. అందులో గ్లామర్ క్వీన్ రాయ్ లక్ష్మి చిందులేయనుందని టాక్. గతంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసిన `అధినాయకుడు` (2012)లో రాయ్ లక్ష్మి మెయిన్ లీడ్ గా నటించింది. కట్ చేస్తే.. దాదాపు పదేళ్ళ తరువాత బాలయ్యతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. త్వరలోనే `అఖండ`లో రాయ్ లక్ష్మి స్పెషల్ నంబర్ పై క్లారిటీ రానున్నది.
`అఖండ`ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ యాక్షన్ డ్రామా తాలూకు చిత్రీకరణకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కదిద్దుకున్నాక షూటింగ్ పునః ప్రారంభం కానుంది.