English | Telugu
`రా ఏజెంట్`గా ప్రభాస్?
Updated : May 31, 2021
`బాహుబలి` సిరీస్ తో పాన్ - ఇండియా స్టార్ ఇమేజ్ పొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే, జోనర్ ఏదైనా.. తన మార్క్ యాక్షన్ కి లోటు లేకుండా చూసుకుంటున్నారు ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో. పిరియడ్ లవ్ సాగాగా తెరకెక్కుతున్న `రాధేశ్యామ్` విడుదలకు సిద్ధమవగా.. యాక్షన్ సాగా `సలార్`, మైథలాజికల్ బేస్డ్ మూవీ `ఆదిపురుష్` చిత్రీకరణ దశలో ఉన్నాయి. అలాగే నాగ్ అశ్విన్ రూపొందించనున్న సైన్స్ ఫిక్షన్ మూవీ.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. బాలీవుడ్ కెప్టెన్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. 2022 చివరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఓ హాలీవుడ్ భామ నాయికగా నటించనుందని ఆమధ్య కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో ఓ `రా ఏజెంట్`గా దర్శనమివ్వనున్నారట యంగ్ రెబల్ స్టార్. ఈ పాత్రని సిద్ధార్థ్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. మరి.. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.