English | Telugu
చిరు, వరుణ్.. ఓ మల్టిస్టారర్!?
Updated : Apr 12, 2022
మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో కలిసి నటించబోతున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ ఓటీటీ సెన్సేషన్ `బ్రో డాడీ` (మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనా, కళ్యాణి ప్రియదర్శన్)ని టాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి నటిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, స్టార్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందనుందని వినిపిస్తోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో చిరు తనయుడిగా వరుణ్ తేజ్ నటించే అవకాశముందట. అదే గనుక నిజమైతే.. చిరు, వరుణ్ స్క్రీన్ షేర్ చేసుకునే మొదటి సినిమా ఇదే కావచ్చు. త్వరలోనే `బ్రో డాడీ` తెలుగు రీమేక్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. ఈ రీమేక్ తెలుగులో ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.
కాగా, తన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చిరు నటించిన మల్టిస్టారర్ `ఆచార్య` ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు.. విక్టరీ వెంకటేశ్ తో కలిసి వరుణ్ నటించిన మల్టిస్టారర్ `ఎఫ్ 3` వచ్చే నెల 27న రిలీజ్ కాబోతోంది. ఇక హరీశ్ శంకర్ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `భవదీయుడు భగత్ సింగ్` తీసే పనుల్లో బిజీగా ఉన్నారు.