English | Telugu
పవర్ స్టార్ ని మళ్ళీ పట్టాడు!!
Updated : Dec 24, 2015
పవర్ స్టార్ తో దాసరి సినిమా చేయబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా వుంటుందో లేదో అని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కన్ఫామ్ అయిందట. సంక్రాంతికి ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారట. ఈ సినిమాను సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడన్నది లేటెస్ట్ న్యూస్. బెంగాల్ టైగర్ తో మాస్ డైరెక్టర్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్న సంపత్ కి పవన్ పై అంతులేని అభిమానం ఉంది. అదే ఈ అవకాశం తెచ్చిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి సర్దార్ గబ్బర్ సింగ్ మిస్ అయిన ఛాన్స్ ని వెంటనే పట్టేసాడు సంపత్ నంది.