English | Telugu

పూరి - ఛార్మి...ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది?

కొన్నాళ్ల నుంచి టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీగా మారింది పూరి జ‌గ‌న్నాథ్ - ఛార్మిల మ‌ధ్య య‌వ్వారం. ఇద్ద‌రూ చాలా చాలా క్లోజ్ అయిపోవ‌డం.. ఈ బంధం అంతే త్వ‌ర‌గా శుభం కార్డు ప‌డిపోవ‌డం జ‌రిగిపోయాయి. పూరి జ‌న్మ‌దినోత్స‌వంలో చార్మి వేసిన స్టెప్పులు, ఇద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త‌.. అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఛార్మిని పూరి ఏకంగా నిర్మాత‌ని చేసేశాడు. జ్యోతిల‌క్ష్మి సినిమా ఛార్మి కోస‌మే తీశాడ‌న్న టాక్ వినిపించింది. ఆ స‌మ‌యంలో... వీరిద్ద‌రి బంధం పీక్స్ కి వెళ్లిపోయింద‌ని టాక్‌.అయితే.. ఇప్పుడు ఇద్ద‌రూ తూచ్ చెప్పుకొని విడిపోయారు. దీనికి కార‌ణం ఏమిటి?? ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది? అన్న ఆస‌క్తి నెల‌కొంది.

పూరి వ్య‌వ‌హారాల్లో చార్మి మితిమీరిన జోక్యం చేసుకొంటోంద‌ని అందుకే ఆమెను దూరంగా ఉంచాల‌ని పూరి నిర్ణ‌యించుకొన్నాడ‌న్న‌ది లేటెస్ట్ టాక్‌. పూరి ఆపీసు మొత్తం.. ఛార్మి క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేసింద‌ని, ఛార్మి వెళ్లాక అక్క‌డ భారీ మార్పులు చోటు చేసుకొన్నాయ‌ని, పూరిని ఎవ‌రు క‌ల‌వాల‌న్నా ఛార్మి అనుమ‌తి తీసుకోవాల్సిన అగ‌త్యం ఏర్ప‌డింద‌ని, పూరి క్లోజ్ స‌ర్కిల్ ఈ విష‌యంలో ఇబ్బంది ప‌డ్డార‌ని ఈ విష‌యాల‌న్నీ పూరి దృష్టికి వెళ్లాయ‌ని... అందుకే చార్మిని దూరం పెట్టాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ట్టు టాక్!

అయితే.. ఈ దూరం కేవ‌లం మీడియా కంట ప‌డ‌కుండా ఉండ‌డానికే అన్న మ‌రో వాద‌న వినిపిస్తోంది. త‌ర‌చూ క‌ల‌సి క‌నిపిస్తుండం వ‌ల్ల పుకార్ల‌కు అవ‌కాశం ఇస్తున్న‌ట్టు అవుతోంద‌ని.. కొన్నాళ్లు గ‌ప్ చుప్‌గా ఉందామ‌ని ఇద్ద‌రూ నిర్ణ‌యించుకొన్నార‌ని, అందుకే గ్యాప్ కావాల‌నే మెయిటీన్ చేస్తున్నారని కొంత‌మంది చెప్పుకొంటున్నారు. అంటే త్వ‌ర‌లో పూరి - ఛార్మిలు మ‌ళ్లీ క‌ల‌సిపోవ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌. ఇది విర‌హానికి విరామం మాత్ర‌మే అన్న‌మాట‌.