English | Telugu
సంక్రాంతి రేసు నుంచి డిక్టేటర్ అవుట్..!!
Updated : Dec 26, 2015
ఫిల్మ్‌నగర్‌లో వినపడుతున్న ఇన్నర్ టాక్ ప్రకారం ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాల మధ్యలో డిక్టేటర్‌ను రిలీజ్ చేయడం కంటే సోలోగానే రిలీజ్ చేయాలన్న ఆలోచనకు ఈ చిత్ర యూనిట్ వచ్చినట్టు సమాచారం. బాలయ్యకెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మంగా డిక్టేటర్ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా కోసం కోన వెంకట్ – గోపీ మోహన్ వంటి రైటర్లను రంగంలోకి దింపి మరీ కథ సిద్ధం చేయించారు. లెజెండ్ హిట్ తర్వాత బాలయ్యకెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఈ టైంలో ఫ్యాన్స్‌పై బాలయ్య సినిమాల పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. తన గత సినిమా లయన్ పరాజయం చెందడంతో ఈసినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని బాలయ్య పట్టు మీద ఉన్నారు.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న నాన్నకు ప్రేమతో – నాగార్జున నటిస్తోన్న సోగ్గాడు చిన్ని నాయానా సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ కి మంచి హైప్ తో రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు బాలయ్య డిక్టేటర్ పై కూడా మంచి హైప్ ఉంది. కానీ బాలయ్య సినిమాఅంటేకేవలం స్టోరీ బలం కన్నా ఇమేజ్ బలంతోనే ఎక్కువగా ఆడుతాయి. నాన్నకు ప్రేమతో సెంటిమెంట్ స్టోరీ, సోగ్గాడే గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే స్టోరీ..ఈ సినిమా హలోబ్రదర్ స్టైల్లో ఉంటుందని టాక్ వస్తోంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్యలో ఈ సినిమాను రిలీజ్ చేసి రిస్క్ చేయడం కంటే సంక్రాంతి హడావిడి తగ్గాక ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో సోలోగానే రావాలని డిక్టేటర్ యూనిట్ డిసైడైందట. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.