English | Telugu

సేమ్ డేట్ కి `గ‌బ్బ‌ర్ సింగ్` కాంబో?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన `గ‌బ్బ‌ర్ సింగ్` చిత్రం.. ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `ద‌బాంగ్` ఆధారంగా రూపొందిన ఈ కాప్ డ్రామా.. 2012 వేస‌విలో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. ఆ యేటి మేటి చిత్రంగా జ‌న‌నీరాజ‌నాలు అందుకుంది.

క‌ట్ చేస్తే.. ప‌దేళ్ళ త‌రువాత మ‌ళ్ళీ అదే సీజ‌న్ లో మ‌రో సినిమాతో ప‌ల‌క‌రించేందుకు ఈ కాంబో సిద్ధ‌మ‌వుతోంది. ఆ వివ‌రాల్లోకి వెళితే.. హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మాణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా హ‌రీశ్ శంక‌ర్ ఓ సినిమాని రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసింది. `గ‌బ్బ‌ర్ సింగ్`లా రీమేక్ తో కాకుండా సొంత క‌థ‌తో ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నాడు హ‌రీశ్. ఎంట‌ర్ టైన్ మెంట్ తో పాటు సోష‌ల్ మెసేజ్ కి కూడా స్కోప్ ఉన్న ఈ చిత్రాన్ని జూన్ లేదా జూలైలో సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నారు. అలాగే, 2022 వేస‌వికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశార‌ట‌. అంతేకాదు.. `గ‌బ్బ‌ర్ సింగ్` రిలీజైన మే 11నే ప‌వ‌న్ - హ‌రీశ్ సెకండ్ జాయింట్ వెంచ‌ర్ కూడా తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని టాక్. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.