English | Telugu

పవన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు గమనించారా..?

అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్‌‌ డేట్‌ను ఎనౌన్స్ చేసిన చిత్రయూనిట్.. ఆ రోజున ఒక సర్‌ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పింది. అది ఏమై ఉంటుందా అని ఎవరి కోణంలో వారు అంచనా వేసుకున్నారు. మెగా కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తున్నాడని.. కాదు కాదు విక్టరీ వెంకటేశ్ వస్తున్నాడని.. అది కూడా కాదు.. జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా అటెండ్ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో బోలెడన్ని వార్తలు వినిపిచ్చాయి. తీరా ఆడియో రిలీజ్ డేట్ వచ్చింది.. పవన్, త్రివిక్రమ్ వచ్చారు.. మాట్లాడారు.. వెళ్లిపోయారు. మరి సర్‌ప్రైజ్ ఏది అని అభిమానులు బుర్ర గొక్కుంటున్నారు. కానీ పవన్- త్రివిక్రమ్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చి వెళ్లారు.

ఆడియో లాంఛ్‌లో వారిద్దరి మాటలను జాగ్రత్తగా గమనిస్తే.. అదేంటో మీకే తెలుస్తుంది. మొదట మాట్లాడిన త్రివిక్రమ్ తాను పవన్ కళ్యాణ్‌తో మరిన్ని సినిమాలు చేస్తానని.. సినిమాపరంగా అండగా ఉంటానని అన్నారు. ఆ తర్వాత మైక్ అందుకున్న పవన్‌.. తనశక్తి మేరకు మిమ్మిల్ని ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటానని అన్నారు. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలు చేస్తాడా..? లేక రాజకీయాల్లో బిజీ అవుతాడా అనే క్లారిటీ ఇవ్వలేదు పవర్‌స్టార్. ఇలాంటి టైంలో పవన్ ఆయన క్లోజ్‌ఫ్రెండ్ త్రివిక్రమ్‌ల నోటీ వెంట సినిమా అన్న మాట రావడం.. నిజంగా సర్‌ప్రైజ్ కాక మరేంటి అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.