English | Telugu
'గోపాల గోపాల' ఫస్ట్ లుక్ ఇలా వుంటుందా?
Updated : Nov 28, 2014
యంగ్ టైగర్ 'టెంపర్' ఫస్ట్ లుక్ సందడి ఇంకా తగ్గకముందే, పవర్ స్టార్ తన సినిమా ఫస్ట్ లుక్ తో రచ్చ చేయడానికి రెడీ అయ్యాడు. 'గోపాల గోపాల'లో పవన్‌కళ్యాణ్ మోడ్రన్ దేవుడి గెటప్‌లో ఎలా ఉంటాడో చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. 'గోపాల గోపాల' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా వుండబోతుందట. పవన్ కళ్యాణ్ తెల్ల చొక్కా వేసుకుని ఉయ్యాలలో పవన్‌కళ్యాణ్ పడుకుని ఉంటే... వెనుక వెంకటేష్ నిలబడి ఉంటాడట. ఈ సినిమాలో పవన్ మోడ్రన్ శ్రీకృష్ణుడి పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం ఆడియో కూడా త్వరలోనే రిలీజ్ కానుంది.