English | Telugu

పరశురామ్ కి హీరో దొరికేశాడు.. అట్లుంటది మనతోని...

 

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం సిద్ధు చేతిలో 'జాక్', 'తెలుసు కదా', 'టిల్లు క్యూబ్' సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. (Siddhu Jonnalagadda)

 

'సోలో', 'గీత గోవిందం' వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు పరశురామ్ (Parasuram).. తన గత రెండు చిత్రాలు 'సర్కారు వారి పాట', 'ఫ్యామిలీ స్టార్'తో నిరాశపరిచాడు. ముఖ్యంగా 'ఫ్యామిలీ స్టార్' బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో పరశురామ్ డైరెక్షన్ లో నెక్స్ట్ సినిమా చేసే హీరో ఎవరనే ఆసక్తి నెలకొంది. ఆ మధ్య తమిళ హీరో కార్తీ వంటి వారి పేర్లు వినిపించినప్పటికీ.. ఏదీ ఫైనల్ కాలేదు. కొంతకాలం క్రితం సిద్ధు పేరు కూడా వినిపించింది. కానీ ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో సిద్ధు వెనకడుగు వేశాడనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ పరశురామ్-సిద్ధు ప్రాజెక్ట్ న్యూస్ తెరపైకి వచ్చింది. పరశురామ్ తో సినిమా చేయడానికి సిద్ధు ఓకే చెప్పినట్లు సమాచారం. దిల్ రాజు నిర్మించనున్న ఈ మూవీ వేసవిలో స్టార్ట్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది అంటున్నారు.