English | Telugu

మెగాస్టార్ తో `అర్జున్ రెడ్డి` కెప్టెన్?

`అర్జున్ రెడ్డి`(2017)తో టాలీవుడ్ లో సెన్సేష‌న‌ల్ డెబ్యూ ఇచ్చారు సందీప్ వంగా. అదే సినిమాని.. `క‌బీర్ సింగ్` (2019) పేరుతో రీమేక్ చేసి హిందీనాట కూడా సంచ‌ల‌నం సృష్టించారు. ప్ర‌స్తుతం ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ్యాట్రిక్ అంకాన్ని పూర్తిచేసే ప‌నిలో ఉన్నారు. బాలీవుడ్ యూత్ స్టార్ ర‌ణ్ బీర్ క‌పూర్ కాంబినేష‌న్ లో చేస్తున్న ఆ సినిమానే.. `యానిమ‌ల్`. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ర‌ణ్ బీర్ కి జంట‌గా ప‌రిణీతి చోప్రా న‌టించ‌నుండ‌గా.. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో అనిల్ క‌పూర్, బాబీ డియోల్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. 2022 ద‌స‌రాకి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. `యానిమ‌ల్` త‌రువాత సందీప్ ఓ తెలుగు సినిమాని డైరెక్ట్ చేయ‌నున్నార‌ని టాక్. అది కూడా.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేష‌న్ లో ఉండొచ్చ‌ని వినిపిస్తోంది. ఇప్ప‌టికే చిరుకి సందీప్ స్టోరీ లైన్ చెప్పార‌ని, మెగాస్టార్ కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యార‌ని టాక్. ప్ర‌స్తుతం చిరు చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. అవి పూర్త‌య్యాకే `అర్జున్ రెడ్డి` కెప్టెన్ తో మెగాస్టార్ కాంబినేష‌న్ మూవీ ఉండొచ్చ‌ని అంటున్నారు. మ‌రి.. ఈ కాంబినేష‌న్ ఏ మేర‌కు మెటీరియ‌లైజ్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.