English | Telugu

బాబోయ్ నయనతార.. రెట్టింపు చేసిందట!!

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసిందని తెలుస్తోంది. నయనతార నటించిన తాజా చిత్రం 'నెట్రికన్' విడుదలకు సిద్దం అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేసేందుకు గాను రూ.20 కోట్లకు కొనుగోలు చేసిందట. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ క్రైమ్ థిల్లర్ ను 2011లో వచ్చిన కొరియన్ మూవీ ‘బ్లైండ్’ స్ఫూర్తితో తెరకెక్కించడం జరిగింది. కళ్ళు కనిపించని ఓ యువతి సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకుందన్నదే ఈ చిత్ర కథ.

మిలింద్ రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో నయన్ నటన అద్బుతంగా ఉంటుందని అంటున్నారు. నిజానికి థియేట్రికల్ రిలీజ్ కోసమే ఈ మూవీని తెరకెక్కించినా.. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. సినిమాకు వచ్చిన హైప్ నేపథ్యంలో ఈ సినిమాను భారీ మొత్తంకు కొనుగోలు చేశారని.. ఓటీటీ, ఇతర రైట్స్ కలుపుకొని 30 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని సమాచారం.

తన మార్కెట్ పెరిగిన నేపథ్యంలో నయనతార తన రెమ్యునరేషన్ ను పెంచాలని నిర్ణయించుకుందట. ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసిందట. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలంటే ఇకపై రూ.10 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ నయనతార డిమాండ్ చేస్తోందట. సౌత్ ఇండియాలో ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన హీరోయిన్ లేదని చెప్పాలి.