English | Telugu
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ!!
Updated : May 25, 2021
అందాల తార శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇక ఇటీవలే విదేశాలలో చదువు పూర్తి చేసిన ఖుషీ కపూర్ కూడా ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలుస్తోంది.
ఖుషీ కపూర్ ఎంట్రీ కోసం ఆమె తండ్రి బోనీ కపూర్ రంగంలోకి దిగాడని అంటున్నారు. బాలీవుడ్ కంటే టాలీవుడ్ లో ముందు ఖుషీ ఎంట్రీ ఇస్తే బెటర్ అనే ఆలోచనలో బోనీకపూర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆదిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక్కడి దర్శక నిర్మాతలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని సమాచారం. గత కొంత కాలంగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అది ఇప్పటివరకు జరగలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె సోదరి ఖుషీ టాలీవుడ్ ఎంట్రీ గురించి వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.
కాగా, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో నటనకు సంబంధించిన కోర్సులు చేసిన ఖుషీ కపూర్ ఈ మధ్యనే ముంబై తిరిగి వచ్చిందట. నిజానికి దర్శకులు రాఘవేంద్రరావు.. శ్రీకాంత్ కుమారుడు రోషన్ తో ‘పెళ్లి సందడి’ అనే సినిమాని ప్రకటించగానే ఆ సినిమాలో హీరోయిన్ గా ఖుషీ నటించనుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె చదువు పూర్తి చేసుకుని రావడంతో మళ్లీ ఆమె ఎంట్రీపై ప్రచారం మొదలైంది.