English | Telugu
మెగాస్టార్‌ని ఢీ కొట్టనున్న బాలీవుడ్ యాక్టర్?
Updated : Jun 30, 2021
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య`తో బిజీగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఆపై మోహన రాజా దర్శకత్వంలో `లూసిఫర్` రీమేక్ చేయనున్నారు చిరు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. కాగా, `లూసిఫర్`తో పాటే యువ దర్శకుడు బాబీ కాంబినేషన్ లోనూ ఓ సినిమా చేయనున్నారు మెగాస్టార్. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి `వీరయ్య` అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
ఇదిలా ఉంటే.. చిరు - బాబీ కాంబినేషన్ మూవీలో ఓ బాలీవుడ్ యాక్టర్ విలన్ గా నటించనున్నట్లు టాక్. ఆ నటుడు మరెవరో కాదు.. నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ `పేట`(2019)లో ప్రతినాయకుడిగా నటించిన నవాజ్.. స్వల్ప విరామం అనంతరం దక్షిణాది చిత్రంలో నటించనుండడం విశేషం. త్వరలోనే నవాజుద్దీన్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. తెలుగులో తొలిసారిగా నటించనున్న నవాజుద్దీన్ కి ఈ మెగా ప్రాజెక్ట్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.