English | Telugu

నాన్నకు ప్రేమతో...బాగా ఎక్కువైంది!!

'నాన్నకు ప్రేమతో' సినిమాలో మైండ్ గేమ్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సుకుమార్ బాగా యాడ్ చేసాడని జగపతిబాబు ఇది వరకే చెప్పాడు. అయితే ఈ సినిమా లెంగ్త్ ఎంత అనేది ఫిల్మ్ నగర్ వర్గాలలో జరుగుతున్న చర్చ ..ఎందుకంటే సుకుమార్ లాస్ట్ మూవీ 'నేనొక్కడినే' లెంగ్త్ బాగా ఎక్కువగా వుందని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. దాంతో 'నాన్నకు ప్రేమతో' లెంగ్త్ ఎంత వుంటుందనేది అభిమానులను తోలుస్తున్న ప్రశ్న.

లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. నాన్నకు ప్రేమతో చిత్రం రన్ టైం 3 గంటల 30 నిమిషాలు వచ్చిందట. ఫాదర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ, మైండ్ గేమ్స్ కలిపి సుకుమార్ ఇంత పెద్ద సినిమా తీశాడట. ఇప్పుడు స్క్రీన్ ప్లే డిస్ట్రబ్ కాకుండా మూవీ లెంగ్త్ ని షార్ట్ గా చేసే పనిలో నిమగ్నమై వున్నాడట. మొత్తానికి ఫైనల్ చేసిన వెర్షన్ ను ఈ నెల 8న సెన్సార్ చేయించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. సో సంక్రాంతికి ఎన్టీఆర్ రెడీ గా వున్నాడనమాట. అదీ సంగతి!!