English | Telugu
మెగాస్టార్..కత్తితో పుల్‌స్టాప్ ..!!
Updated : Jan 5, 2016
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా ఇప్పటకీ షూటింగ్ స్టార్ట్ కాలేదు. కానీ 151 సినిమా పై మాత్రం మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే చిరు మాత్రం 150 వ సినిమా తో ఇక సినీ రంగానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలని భావిస్తున్నాడట. కొత్త సంత్సరం సందర్భంగా ఫ్యాన్స్ ని కలిసిన ఆయన 150 వ సినిమాగా కత్తి చేస్తున్నా..ఇదే నా ఆఖరి సినిమా అని స్పష్టం చేసేసారట. మళ్లీ మళ్లీ సినిమా చేయమని తనను అడగవద్దని చెప్పాడట. ఇక కత్తి తరువాత రాజకీయాల్లో మరింత క్రియాశీలంగా వ్యవహరించడమే ముఖ్యమని చిరు భావిస్తున్నాడట. అందుకనే ముందుగానే మెగా ఫ్యాన్స్ తేల్చిచెప్పారట..నిజంగా మెగా సీనీ అభిమానులకు ఇది చేదు వార్తే!