English | Telugu

`శ్యామ్ సింగ రాయ్`.. రైట‌ర్ గా నాని?

`గ్యాంగ్ లీడ‌ర్`(2019) చిత్రంలో క్రైమ్ న‌వ‌లిస్ట్ గా ఎంట‌ర్టైన్ చేసిన నేచుర‌ల్ స్టార్ నాని.. మ‌రోమారు రైట‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడా? అవున్న‌దే టాలీవుడ్ టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `శ్యామ్ సింగ రాయ్` పేరుతో నాని ఓ పిరియ‌డ్ డ్రామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో బెంగాలీ యువ‌కుడు శ్యామ్ సింగ రాయ్ గా, తెలుగు కుర్రాడు వాసుగా ద్విపాత్రాభిన‌యం చేశాడు నాని. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఈ రెండు పాత్ర‌ల్లోనూ రైట‌ర్ గానే క‌నిపిస్తాడ‌ట ఈ టాలెంటెడ్ హీరో. ఫ్లాష్ బ్యాక్ లో వ‌చ్చే శ్యామ్ సింగ రాయ్ ఓ బెంగాలీ ర‌చ‌యిత కాగా, ప్ర‌జెంట్ టైమ్ లైన్ లో ఉండే వాసు ఓ సినిమా రైట‌ర్ అని టాక్. మ‌రి.. ఈ రెండు పాత్ర‌ల ప‌రంగా నాని ఎలాంటి వేరియేషన్ చూపిస్తాడో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, `శ్యామ్ సింగ రాయ్`లో నానికి జోడీగా సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టెయిన్ న‌టించ‌గా.. మిక్కీ జే మేయ‌ర్ బాణీలు అందించాడు. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 24న విడుద‌ల కానున్న `శ్యామ్ సింగ రాయ్`.. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ, క‌న్న‌డ భాష‌ల్లోనూ ఏక‌కాలంలో రిలీజ్ కానుంది.