English | Telugu

`స్పిరిట్`లో ప్ర‌భాస్ కి జోడీగా కియారా?

`అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` పేరుతో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఓ పాన్ - వ‌ర‌ల్డ్ మూవీని చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ కెరీర్ లో 25వ సినిమాగా తెర‌కెక్క‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ.. వ‌చ్చే ఏడాది ప‌ట్టాలెక్క‌నుంది. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, జ‌ప‌నీస్, చైనీస్, కొరియ‌న్ భాష‌ల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎంట‌ర్టైన్ చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ దివా క‌రీనా క‌పూర్ నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ కి జంట‌గా మ‌రో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని న‌టించే అవ‌కాశం ఉంద‌ట‌. ఇదివ‌ర‌కు సందీప్ రెడ్డి రూపొందించిన `క‌బీర్ సింగ్` (`అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్)లో నాయిక‌గా న‌టించిన కియారా.. స్క్రిప్ట్, త‌న క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ చేయ‌డానికి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

కాగా, `భ‌ర‌త్ అనే నేను`లో సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకి జోడీగా, `విన‌య విధేయ రామ‌`లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ జ‌త‌గా అల‌రించిన కియారా అద్వాని.. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ - శంక‌ర్ కాంబినేష‌న్ మూవీలో న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది.