English | Telugu
జ్వరంతోనే అదరగొడుతున్న ఎన్టీఆర్
Updated : Dec 31, 2015
గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఎన్టీఆర్ ..ఆ బాధను లెక్కచేయకుండా 'నాన్నకు ప్రేమతో' షూటింగ్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఎంతో క్లిష్టమైన డాన్స్ మూమెంట్స్‌ని బాధ పడుతూనే పూర్తి చేస్తోన్న తారక్ డెడికేషన్‌ని చూసి యూనిట్ సభ్యులు ముచ్చట పడుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అయిన విజయ్ సి. చక్రవర్తి అయితే తారక్ సిన్సియారిటీని, వృత్తి పట్ల తనకి వున్న నిబద్ధతని విపరీతంగా కొనియాడుతున్నాడు. రెండు రోజుల నుంచీ హైదరాబాద్‌లో ఈ పాటను తెరకెక్కిస్తున్నారు. అన్నట్లు ఎన్టీఆర్‌కు ఇది 25వ చిత్రం కావడం, సుకుమార్ దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.