English | Telugu
సినిమాటోగ్రాఫర్ కూతురితో మహేశ్ రొమాన్స్?
Updated : Jun 9, 2021
సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `మహర్షి` ఒకటి. జాతీయ పురస్కారాలు సైతం అందుకున్న ఈ సోషల్ డ్రామాకి కె.యు. మోహనన్ అందించిన ఛాయాగ్రాహణం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉంటే.. 30 ఏళ్ళకి పైగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న మోహనన్ కి ఓ అందమైన కుమార్తె ఉంది. ఆమె మరెవరో కాదు.. విజయ్ `మాస్టర్` సినిమాలో హీరోయిన్ మాళవికా మోహనన్. ఇప్పుడీ బ్యూటీ మహేశ్ తదుపరి చిత్రంలో నాయికా సందడి చేయనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ముగ్గురు కథానాయికలకు స్థానముందట. వారిలో ఒకరిగా మాళవికా మోహనన్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే మహేశ్ - త్రివిక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్ లో మాళవికా మోహనన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. తన తండ్రి మోహనన్ కలిసొచ్చినట్లే మాళవిక కూడా మహేశ్ కి అచ్చొస్తుందేమో చూడాలి.
కాగా, మరోవైపు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - ఏస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ - ఇండియా మూవీలోనూ మాళవికా మోహనన్ నాయికగా ఎంపికైందని ప్రచారం జరుగుతోంది.