English | Telugu

కమల్ కు వాళ్ళు సహాయం చేస్తారా?

          

కమల్ హాసన్ నటించిన "విశ్వరూపం" చిత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, చివరకు కమల్ తన ఆస్తులను కూడా అమ్ముకొనే పరిస్థితి కలిపించిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలై ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఆగిపోకుండా కమల్ ఈ సినిమాకు రెండో భాగం తీస్తుండడం పై అన్ని భాషల సినీ పరిశ్రమ మొత్తం కూడా నోరు మెదపలేని పరిస్థితిలో ఉండిపోయింది.

 

మొదటి భాగం సమయంలో తన ఆస్తులన్నీ ఎక్కడ కోల్పోయి రోడ్డున పడతాడేమోనని, అన్ని భాషల సినీ ప్రముఖులు మద్దతివ్వడంతో విశ్వరూపం విడుదలై కనీసం ఉండడానికి మళ్ళీ కాస్త చోటు దక్కినట్లయ్యింది. ఇదంతా తెలిసి కూడా మళ్ళీ ఇపుడు "విశ్వరూపం-2" సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం 75% షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు కమల్.

 

ఈ చిత్రం విడుదలకు ముందు ఏమైనా సమస్యలు వస్తే ఎలాగైనా కమల్ కంటికి కనిపించకుండ ఉండాలని, ఈసారి ఎవరు కూడా సహాయం చేయొద్దని అనుకుంటున్నట్లు ఫిలిం నగర్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ "విశ్వరూపం-2" చిత్రం విడుదల సమయంలో కూడా ఇంకా ఏమైనా సమస్యలు వస్తాయా? ఈసారి ఏ సినిమా ఇండస్ట్రీ నుండి కమల్ కు మద్దతు వస్తుంది? అనేది సెప్టెంబర్ నెలలో తెలియనుంది.