English | Telugu

మరో మెగా హీరోకు జోడిగా కృతి శెట్టి!!

‘ఉప్పెన’ మూవీతో వెండితెరకు పరిచయమైన కృతి శెట్టి ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది. వరుస మూవీ ఆఫర్స్ ఈ అమ్మడిని చుట్టుముడుతున్నాయి. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ ముద్దుగుమ్మ నటించబోతుందని న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. కార్తీక్ దర్శకుడుగా గతంలో 'భంభోలేనాథ్' అనే సినిమా చేశాడు. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా గురువు సుకుమార్ నిర్మాణంలో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుకుమార్, బివిఎస్‌ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ కృతిశెట్టిని సంప్రదించగా ఆమె నుండి సానుకూలంగా స్పందన వచ్చిందని టాక్.

కాగా, కృతి శెట్టి తన మొదటి చిత్రం ‘ఉప్పెన’లో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి రొమాన్స్ పండించింది. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా మూవీ టీంకి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు కూడా సుకుమార్ శిష్యుడు కావడం గమనార్హం. మరి తమ్ముడు వైష్ణవ తేజ్ కి కలిసొచ్చిన కృతి శెట్టి, సుకుమార్ శిష్యుడు సెంటిమెంట్ అన్న సాయి ధరమ్ కి కలిసొస్తుందేమో చూడాలి.