English | Telugu

'గోపాల గోపాల' అంతా వెంకీ మాయ

పవన్ కళ్యాణ్, వెంకటేష్ 'గోపాల గోపాల' డిజిట‌ల్ పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ఇద్దరూ వున్న అందరి కళ్ళు పవన్ పైనే. అందరి చర్చ పవన్ గురించే. ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ని డామినేట్ చేసాడని అంటున్నారు.ఈ సినిమాలో కూడా పవన్ కృష్ణుడి పాత్రే హైలైట్ అవుతుందని ఎన్నో అంచనాలు పెంచుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. గోపాల గోపాలలో పవన్ కంటే వెంకీ పాత్రే సినిమాకు మైయిన్ హైలైట్ గా నిలవబోతుందట. వెంకీ తన పెర్‌ఫార్మెన్స్‌తో, డైలాగుల‌తో సినిమా మొత్తం అదరగోట్టేస్తాడట. నాలుగైదు సీక్వెన్స్‌ల‌లో వెంకీ త‌న న‌ట‌న‌తో కంట‌త‌డి పెట్టిస్తాడ‌ట‌. బాలీవుడ్ ఓమైగాడ్‌లోనూ అక్షయ్ కుమార్ కన్న ప‌రేష్‌రావ‌ల్ కే ఎక్కువ పేరొచ్చింది. మరి ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవబోతుందా? లేక ప‌వ‌న్ పైచేయిస్తాధిస్తాడా?తె లియాలంటే ఈ సినిమా వ‌చ్చే వ‌ర‌కూ ఓపిక ప‌ట్టాలి.