English | Telugu

'గేమ్ ఛేంజర్' స్టోరీ ఇదే.. ఎక్కడో కొడుతుంది శీనా..!

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా.. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ చక్కర్లు కొడుతోంది.

'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. తండ్రీకొడుకులుగా కనిపించనున్నాడు. మొదట, కొడుకు స్టోరీతో సినిమా స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్ నుంచి ఐఏఎస్ గా కొడుకు ఎదిగిన క్రమాన్ని చూపిస్తారు. కలెక్టర్ అయిన తర్వాత ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా కొడుకు వ్యవహరిస్తాడు. కట్ చేస్తే, ఆ పార్టీని స్థాపించింది తన తండ్రే అని తెలుసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి సామాన్యుడి నుంచి నాయకుడిగా ఎదగడం, నిజాయితీగా రాజకీయాలు చేయడం, పార్టీని స్థాపించడం, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య వంటి వారు వెన్నుపోటు పొడవటం చూపిస్తారు. ఇదంతా తెలుసుకున్న కొడుకు.. తన తండ్రి స్థాపించిన పార్టీని ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకుంటాడు. అలాగే ఒక అధికారిగా ఏ రాజకీయ పార్టీ పక్షాన నిలబడకుండా.. నిజాయితీగా ఎన్నికలను జరిపించే ప్రయత్నం చేస్తాడు. ఇదే 'గేమ్ ఛేంజర్' స్టోరీ అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి.

కాగా 'గేమ్ ఛేంజర్' స్టోరీ ఇదేనంటూ జరుగుతున్న ప్రచారంపై మెగా అభిమానులు, నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఎక్కడో కొడుతుంది శీనా.. స్టోరీ చాలా నార్మల్ గా ఉంది" అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం కావాలని ఫేక్ స్టోరీ లు స్ప్రెడ్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. 'గేమ్ ఛేంజర్' చిత్ర కథాకథనాలు బలంగా ఉంటాయని, సోషల్ మీడియా ప్రచారాలను నమ్మొద్దని అంటున్నారు. మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న స్టోరీలో నిజమెంతో తెలియదు కానీ, అసలు 'గేమ్ ఛేంజర్' స్టోరీ ఏంటనేది మాత్రం కొన్ని వారాల్లో తేలిపోనుంది.