English | Telugu

`ఎ‌న్టీఆర్ 30`కి రాక్ స్టార్ బాణీలు?

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కి అచ్చొచ్చిన సంగీత ద‌ర్శ‌కుల్లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `అదుర్స్`, `నాన్న‌కు ప్రేమ‌తో`, `జ‌న‌తా గ్యారేజ్`, `జై ల‌వ కుశ‌` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. కాగా, స్వ‌ల్ప విరామం త‌రువాత ఈ ఇద్ద‌రు మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్నార‌ట‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో `జ‌న‌తా గ్యారేజ్` త‌రువాత తార‌క్ మ‌రో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `ఎ‌న్టీఆర్ 30` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. జూన్ నుండి ప‌ట్టాలెక్క‌నున్న ఈ పాన్ - ఇండియా మూవీని 2022 ఏప్రిల్ 29న రిలీజ్ చేయ‌బోతున్నారు. కాగా, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా డీఎస్పీని ఎంచుకున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే `ఎన్టీఆర్ 30`లో దేవిశ్రీ ప్ర‌సాద్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

ఇదిలా ఉంటే.. కొర‌టాల తొలి నాలుగు చిత్రాల‌కు డీఎస్పీనే సంగీత‌మందించిన విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం చిత్రీక‌రణ ద‌శ‌లో ఉన్న `ఆచార్య‌`కి మాత్రం మెలోడీబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీలు అందిస్తున్నారు.