English | Telugu

క‌ళ్యాణ్‌రామ్‌తో బోయ‌పాటి చిత్రం?

నంద‌మూరి కుటుంబంలో ఇప్ప‌టికే ఇద్ద‌రు క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేశారు స్టార్ కెప్టెన్ బోయ‌పాటి శ్రీ‌ను. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `సింహా`, `లెజెండ్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్స్ చేసిన బోయ‌పాటి.. ప్ర‌స్తుతం `అఖండ‌` తీస్తున్నారు. అలాగే యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో `ద‌మ్ము` చేశారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రో నంద‌మూరి హీరోతో సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట ఈ మాస్ సినిమాల స్పెష‌లిస్ట్‌.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌ల క‌ళ్యాణ్ రామ్ ని సంప్ర‌దించి బోయ‌పాటి ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ను వినిపించార‌ట‌. త‌ను ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని స‌బ్జెక్ట్ కావ‌డం.. బోయ‌పాటి వంటి అగ్ర ద‌ర్శ‌కుడి కాంబినేష‌న్ కావ‌డంతో వెంట‌నే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పార‌ట క‌ళ్యాణ్ రామ్. యాక్ష‌న్ తో కూడిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ఉంటుంద‌ని.. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై క‌ళ్యాణ్ నే ఈ సినిమాని నిర్మించే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో నిజ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ మైత్రీ మూవీ మేక‌ర్స్ లో ఓ సినిమా చేస్తున్నారు. రాజేంద్ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.