English | Telugu

ఓటీటీలో వెంకీ `దృశ్యం 2`?

విక్ట‌రీ వెంక‌టేశ్ కెరీర్ లోనే అత్యంత వేగంగా పూర్త‌యిన చిత్రంగా రికార్డుల‌కెక్కింది `దృశ్యం 2`. ఒక‌టిన్న‌ర నెల‌లోపే త‌న షూటింగ్ పార్ట్ ని పూర్తిచేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు వెంకీ. కాగా, ఈ నెలాఖ‌రులోపు ఈ సినిమాకి సంబంధించి చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌వుతుంద‌ని టాక్.

ఇదిలా ఉంటే.. ఒరిజ‌న‌ల్ గా రూపొందిన మ‌ల‌యాళ వెర్ష‌న్ (మోహ‌న్ లాల్ న‌టించిన `దృశ్యం 2`) ఎలాగైతే ఓటీటీలో స్ట్రీమ్ అయిందో అదే త‌ర‌హాలో ఈ రీమేక్ ని కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ని వినికిడి. ప్ర‌స్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ దృష్ట్యా `దృశ్యం 2` టీమ్ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

2014 నాటి `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందుతున్న `దృశ్యం 2`లో వెంకీకి జోడీగా మీనా న‌టిస్తున్నారు. ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌దియా, న‌రేశ్, సంప‌త్ రాజ్, ఎస్తేర్ అనిల్, కృతిక‌, పూర్ణ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. `దృశ్యం`ని శ్రీ‌ప్రియ తెర‌కెక్కించ‌గా.. `దృశ్యం 2`ని మ‌ల‌యాళ వెర్ష‌న్ డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ రూపొందిస్తున్నారు.