English | Telugu

సూర్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌తో దిల్ రాజు మూవీ?

కోలీవుడ్ స్టార్ సూర్య ఓ బైలింగ్వల్ మూవీ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. మాస్ సినిమాల స్పెష‌లిస్ట్ బోయ‌పాటి శ్రీ‌ను.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కోసం త‌యారు చేసుకున్న క‌థ‌ని సూర్యకి వినిపించార‌ని, అది న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పార‌ని ఇప్ప‌టికే కొన్ని క‌థ‌నాలు వెలుగులోకి వ‌చ్చాయి.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తార‌ట‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్ తో నిర్మించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని టాక్. అదే గ‌నుక నిజ‌మైతే.. 'భ‌ద్ర' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను, దిల్ రాజు కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమా ఇదే అవుతుంది. ఇక సూర్య‌తో దిల్ రాజుకి ఫ‌స్ట్ కాంబో ఫ్లిక్ అవుతుంది. త్వ‌ర‌లోనే సూర్య - బోయ‌పాటి శ్రీ‌ను - దిల్ రాజు కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను త‌న ల‌క్కీ హీరో న‌ట‌సింహ బాల‌కృష్ణ‌తో ఓ యాక్ష‌న్ డ్రామా చేస్తున్నారు. అది పూర్త‌య్యాకే సూర్య కాంబో మూవీ ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంది. మ‌రి.. ఈ కాంబినేష‌న్ వార్త‌ల‌కే ప‌రిమిత‌మా? లేదంటే కార్య‌రూపం దాల్చుతుందా? తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.