English | Telugu

`అఖండ‌` సుంద‌రికి `మెగా` ఆఫ‌ర్?

లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేష‌న్ `అఖండ‌`తో త‌న కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది ప్ర‌గ్యా జైశ్వాల్. ఇందులో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న క‌నువిందు చేసింది ప్ర‌గ్యా. అలాగే, ``జై బాల‌య్య‌`` పాట‌లో త‌న చిందుల‌తో మురిపించింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడీ ముద్దుగుమ్మ‌కి ఓ మెగా ప్రాజెక్ట్ లో న‌టించే ఛాన్స్ ద‌క్కింద‌ని బ‌జ్.

తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల షేర్ దాటిన 'అఖండ' ప్ర‌భంజ‌నం!

ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. `మెగా 154` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ బ‌డ్జెట్ వెంచ‌ర్ ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇటీవ‌లే సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమాలో ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌ముంద‌ట‌. అందులో ఒక‌రిగా ప్ర‌గ్యా జైశ్వాల్ ని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే.. ప్ర‌గ్యాకి ఇది బంప‌ర్ ఆఫ‌రే. మ‌రి.. బాల‌య్య‌తో జ‌ట్టుక‌ట్టి `అఖండ‌` విజ‌యం అందుకున్న ప్ర‌గ్యా.. చిరుకి జోడీగానూ ఆక‌ట్టుకుంటుందేమో చూడాలి.

అన‌సూయ పుట్టింట విషాదం.. కేన్స‌ర్‌తో తండ్రి మృతి

కాగా, ఇప్ప‌టికే మెగా కాంపౌండ్ లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కి జంట‌గా `కంచె`లోనూ, `సుప్రీమ్` హీరో సాయి తేజ్ స‌ర‌స‌న `న‌క్ష‌త్రం`లోనూ సంద‌డి చేసింది ప్ర‌గ్యా జైశ్వాల్.