English | Telugu

నాని మూవీలో ఐదుగురు హీరోయిన్లు!! 

నేచురల్ స్టార్ నాని ఒక వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా మారి తన అభిరుచికి తగ్గట్లు సినిమాలు నిర్మిస్తున్నారు. 'వాల్ పోస్టర్ సినిమా' అనే బ్యానర్ పై ఇప్పటికే 'అ!', 'హిట్' సినిమాలను నిర్మించి నిర్మాతగానూ సక్సెస్ అయిన నాని.. తన బ్యానర్ పై మూడో సినిమాగా హిట్-2 ను చేస్తున్నారు. ఇక ఇటీవల నాని బ్యానర్ లో నాల్గవ చిత్రం కూడా లాంచ్ అయింది. ఈ చిత్రానికి 'మీట్ క్యూట్' అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.

'మీట్ క్యూట్' సినిమాతో తన సోదరి దీప్తీ ఘంటాను దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు నాని. ఈ సినిమా ఒక ఆసక్తికర అంశం చుట్టూ తిరుగుతోందని.. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. అందులో ముగ్గురు పాపులర్ హీరోయిన్లు కాగా.. ఇద్దరు కొత్త హీరోయిన్లు ఉంటారని అంటున్నారు.

హీరోయిన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తానని ప్రకటించిన నాని.. ఒక్కొక్కరి పేరు ఒక్కోసారి ప్రకటించి కొత్తగా పబ్లిసిటీ చేసుకుందామని నాని ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్న చిత్ర యూనిట్.. 30 రోజుల్లో షూట్ పూర్తి చేయనుందని సమాచారం. సీనియర్ యాక్టర్ సత్య రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.