English | Telugu
ప్రభాస్ రానున్న 6 సినిమాలు ఓ రేంజ్‌లో లేవుగా!
Updated : Feb 11, 2021
'బాహుబలి' సిరీస్‌తో ప్యాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా అవతరించిన ప్రభాస్ రాబోయే సినిమాల లిస్ట్ చూస్తే.. అతని ఇమేజ్ ఏ రేంజ్‌కు వెళ్తుందో ఊహించలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతని లేటెస్ట్ ఫిల్మ్ 'రాధేశ్యామ్' ఏప్రిల్‌లో విడుదలకు రెడీ అవుతోంది. ఈ ప్రభాస్ 20వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, రాధాకృష్ణ కుమార్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
ప్రభాస్ 21వ చిత్రంగా 'సలార్' రిలీజ్ కానున్నది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో ప్రభాస్ జోడీగా తొలిసారి శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ ఏడాదే ఈ మూవీని తీసుకు రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రభాస్ 22వ మూవీ 'ఆదిపురుష్'ను బ్లాక్‌బస్టర్ మూవీ తానాజీ ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. రామాయణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీరామునిగా ప్రభాస్ నటిస్తుంటే, రావణునిగా సైఫ్ అలీఖాన్ చేస్తున్నాడు. సీత పాత్రధారి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. 2022 సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
ప్రభాస్ 23వ ఫిల్మ్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వనీదత్ నిర్మించనున్న సైన్స్ ఫిక్షన్ లవ్ స్టోరీ. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో దీపికా పడుకోనే హీరోయిన్ కాగా, అమితాబ్ బచ్చన్ ఓ కీలక రోల్ చేయనున్నారు. 2023లో ఈ చిత్రం విడుదల కానున్నది.
ప్రభాస్ 24వ సినిమాని యాక్షన్ మూవీల స్పెషలిస్ట్ (వార్, పఠాన్ ఫేమ్) సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించనున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ మూవీ 2023లో మొదలనున్నది. గత ఏడాది ప్యాండమిక్ టైమ్‌లో ప్రభాస్‌తో పలుమార్లు ఈ సినిమాపై సిద్ధార్థ్ చర్చలు జరిపాడు.
ప్రభాస్‌కు మైల్‌స్టోన్ లాంటి 25వ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నది. దీనికి డైరెక్టర్ ఎవరు, ఎప్పుడు మొదలవుతుందనే విషయాలు తర్వాత వెల్లడవుతాయి.
మొత్తానికి 2023 వరకు ప్రభాస్ డైరీ ఫుల్ అయిపోయింది. ఇప్పటికే ప్యాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా పేరుపొందిన ప్రభాస్ ఇమేజ్, క్రేజ్ ఈ సినిమాలతో ఏ రేంజ్‌కు వెళ్తుందో వెయిట్ అండ్ సీ...