English | Telugu
అనుపమ పరమేశ్వరన్, జస్‌ప్రీత్ బుమ్రా పెళ్లాడుతున్నారా? నిజమేంటి?
Updated : Mar 6, 2021
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. తన పెళ్లి గురించి ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, ఇండియన్ నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఆమె పెళ్లాడనున్నదనే ప్రచారం జోరుగా నడుస్తున్నాయి.
ఇటీవల తాను ద్వారకకు వెళ్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఫ్యాన్స్‌కు సమాచారం ఇచ్చింది అనుపమ. అది బుమ్రా సొంత పట్నం అహ్మదాబాద్‌కు సమీపంలో ఉండటం గమనార్హం. ఇటీవల ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ కల్పించింది బీసీసీఐ. వ్యక్తిగత కారణాలవల్ల తనను ఆ టెస్ట్ నుంచి తప్పించాల్సిందిగా బుమ్రాయే బీసీసీఐను కోరాడు. దాంతో సోషల్ మీడియాలో అనుపమ, బుమ్రా పెళ్లి గురించి స్పెక్యులేషన్స్ ఊపందుకున్నాయి.
మలయాళీ అయిన అనుపమ టాలీవుడ్‌లో త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అ ఆ' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. 'శతమానం భవతి' సినిమా ఆమెకు క్రేజ్ తెచ్చింది. ఈమధ్య 'రాక్షసుడు' లాంటి హిట్ మూవీలోనూ ఆమె నాయికగా నటించింది. ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో '18 పేజెస్' అనే మూవీ చేస్తోంది.
ఇదివరకే బుమ్రాతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. వాటిని ఆమె ఖండించింది. లేటెస్ట్‌గా బుమ్రా పెళ్లి గోవాలో జరగనున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. అతనికి కాబోయే భార్య గురించి సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ నడుస్తోంది. అతను అనుపమను పెళ్లాడనున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కాగా బుమ్రాతో తమ కుమార్తె పెళ్లి అనేది కేవలం ఒక వదంతి మాత్రమేనని అనుపమ తల్లి సునీత స్పష్టం చేశారు. అనుపమ గుజరాత్‌లోని ద్వారకకు వెళ్లింది తను నటిస్తోన్న తెలుగు సినిమా షూటింగ్ కోసమని ఆమె తేల్చేశారు.