Read more!

English | Telugu

ప్రపంచ సైన్యం ఉపయోగించే ఆయుధాలతో ‘టైగర్‌ 3’ యాక్షన్‌ సీన్స్‌!

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘టైగర్‌ 3’. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తోన్న స్పై యూనివర్స్‌లో భాగంగా ‘టైగర్‌ 3’ మూవీని నిర్మించారు. సీట్‌ ఎడ్జ్‌ యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రపంచంలోని ప్రముఖ సైన్యాలు యుద్ధ సమయంలో ఉపయోగించే ఆయుధాలను చూపించామని చిత్ర దర్శకుడు మనీష్‌ శర్మ తెలియజేశారు. 

ఈ సినిమా విశేషాలను దర్శకుడు మనీష్‌శర్మ తెలియజేస్తూ  ‘‘టైగర్‌ 3 చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు చాలా యుద్ధ ట్యాంకులను, చాపర్స్‌, గన్స్‌, బ్లాస్టిక్‌ మిస్సైల్స్‌ను ఉపయోగించాం. ప్రేక్షకులకు ఈ ఆయుధాలను చూసేటప్పుడు ఒరిజినల్‌ ఫీలింగ్‌ రావాలనే ఉద్దేశంతో ప్రపంచంలోని ప్రముఖ సైన్యాలను ఉపయోగించే ఆయుధాలను ఉపయోగించాం. థియేటర్స్‌లో చూసే ఆడియెన్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకుంటారు. టైగర్‌ పాత్రలో సల్మాన్‌ ఖాన్‌ ఉన్నతమైన ఆశయాలతో ప్రత్యర్థులతో పోరాటం చేస్తారు’’ అన్నారు. 

మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన టైగర్‌ 3 మూవీని యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. నవంబర్‌ 12న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ లెవల్లో రిలీజ్‌ అవుతుంది. స్పై యూనివర్స్‌లో ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రూపొందించిన ఈ సంస్థ నుంచి ఇప్పుడు టైగర్‌ 3 రిలీజ్‌ కానుంది.