Read more!

English | Telugu

Tiger 3: బుకింగ్స్ తక్కువే... మిస్ అవుతున్న సల్మాన్ ఇంపాక్ట్, షారుఖ్ ని దించాల్సిందే

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ కి గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్ ‘టైగర్’. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలతో ఇండియాలో స్పై సినిమాలకి మార్కెట్ పెంచాడు సల్మాన్ ఖాన్. టైగర్ గా సల్మాన్ చేసిన క్యారెక్టర్ కి సూపర్ క్రేజ్ ఉంది, జోయాగా కనిపించిన కత్రినా కైఫ్ కూడా యాక్షన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు టైగర్ ఫ్రాంచైజ్ నుంచి మూడో సినిమా టైగర్ ౩ రిలీజ్ కాబోతుంది. నవంబర్ 12న టైగర్ 3 సినిమా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. టైగర్ కి విలన్ గా ఇమ్రాన్ హాష్మి దిగడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్... కత్రినా-సల్మాన్ కాంబినేషన్ టైగర్ ౩ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సినిమాపై హైప్ బాగానే ఉంది కానీ బుకింగ్స్ లో మాత్రం జోష్ కనిపించట్లేదు. దీపావళి పండగ రోజున టైగర్ ౩ సినిమాని రిలీజ్ చేస్తుండడమే వీక్ ఓపెనింగ్స్ ని కారణం అయ్యింది. దీపావళి రోజున మార్నింగ్ షో సమయంలో పూజలు, సాయంత్రం టపాసులు పేల్చే పనిలో ఉంటారు కాబట్టి టైగర్ 3 సినిమాకి టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎవరూ ముందుకి వస్తున్నట్లు లేరు. టైగర్ ౩కి లాంగ్ రన్ దొరికినా, ఓపెనింగ్ డే రోజున మాత్రం కలెక్షన్స్ వీక్ గానే ఉండేలా ఉన్నాయి బుకింగ్స్. ఈ ట్రెండ్ మారాలి అంటే యష్ రాజ్ ఫిల్మ్స్... షారుఖ్ ఖాన్ ని రంగంలోకి దించాల్సిందే. షారుఖ్ ‘పఠాన్’గా టైగర్ ౩ సినిమాలో క్యామియో ప్లే చేసాడు. ఈ క్యామియోకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తే బుకింగ్స్ లో జోష్ వచ్చే అవకాశం ఉంది. షారుఖ్ అండ్ సల్మాన్ కి కలిసి చూడడానికైనా సిని అభిమానులు థియేటర్స్ కి వస్తారు.