English | Telugu

ఆ సినిమాకి పట్టిన గతే మీ సినిమాకి పడుతుంది..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 

ఆ సినిమాకి పట్టిన గతే మీ సినిమాకి పడుతుంది..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 

2022 లో భారతీయ సినీ ప్రేమికుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న 'ది కాశ్మీరీ ఫైల్స్'(The Kashmir Kiles)ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.ఈ మూవీ తర్వాత  2023 లో 'ది వాక్సిన్ వార్' అనే మరో చిత్రాన్ని ప్రేక్షకులకి అందించాడు.కోవిడ్ నుంచి ప్రజలని కాపాడటానికి భారతీయ శాస్త్ర వేత్తలు వ్యాక్సిన్ తయారు చేసిన సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా, ప్రేక్షకాధరణని మాత్రం పెద్దగా పొందలేకపోయింది.

 వివేక్ ప్రస్తుతం'ది దిల్లీఫైల్స్,బెంగాల్ చాప్టర్'(The delhi files bengal chapter)అనే మరో వాస్తవిక కథతో కూడిన చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.రీసెంట్ గాఒక నెటిజన్ 'ఎక్స్' వేదికగా వివేక్ ని ఉద్దేశించి ట్వీట్ చేస్తు 'మీ గత చిత్రానికి ఏ గతి పట్టిందో,ఈ చిత్రానికి కూడా అదే గతి పడుతుంది.దిల్లీ ఫైల్స్ ఆడదు అంటు ట్వీట్ చేసాడు.ఇప్పుడు ఈ ట్వీట్ పై వివేక్ స్పందిస్తు 'వావ్,మీరు చెప్పేది చాలా గొప్ప విషయం,మేము ది వాక్సిన్ వార్ తో సంపాదించిన డబ్బుతోనే దిల్లీ ఫైల్స్ ని రూపొందిస్తున్నామంటు' ట్వీట్ చేసాడు.

1971 లో బెంగాల్ లో జరిగిన మానవ సంక్షోభం పై ఈ చిత్రం తెరకెక్కగా చిత్ర యూనిట్ ఈ కథపై సుమారు మూడు సంవత్సరాల పాటు పరిశోధన జరిపింది.ది కాశ్మీరీ ఫైల్స్ ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తుండగా మిథున్ చక్రవర్తి, పల్లవి జోషితో పాటు మరికొంత మంది క్రేజీ నటులు ఇందులో నటించనున్నారు.రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందనుంది. 

 

ఆ సినిమాకి పట్టిన గతే మీ సినిమాకి పడుతుంది..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు