English | Telugu
కత్రినా కంటే ముందు విక్కీ కౌశల్ డేటింగ్ చేసింది ఈమెతోటే!
Updated : Nov 11, 2021
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇద్దరిలో ఎవరూ దీని గురించి పబ్లిగ్గా చెప్పకపోయినా, క్లోజ్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని బయటపెట్టారు. రాజస్థాన్‌లో వారి పెళ్లి జరగనున్నదనే విషయం కూడా బాలీవుడ్ సర్కిల్స్‌లో నడుస్తోంది. కాగా, కత్రినా కంటే ముందు మరో నటితో కొంతకాలం విక్కీ ప్రేమాయణం నడిపాడు. ఆ విషయాన్ని విక్కీ ఓపెన్‌గా చెప్పాడు కూడా. 2019 ఫిబ్రవరిలో విడుదలైన అతడి సినిమా 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్' బ్లాక్‌బస్టర్ హిట్టవడంతో ఒక్కసారిగా విక్కీ పేరు మారుమోగింది.
అంతకంటే ముందు 2018 జూలైలో నటి హర్లీన్ సేఠితో అతను డేటింగ్‌లో ఉన్నాడంటూ ప్రచారంలోకి వచ్చింది. ఆ ఇద్దరూ కలిసి జంటగా విహరిస్తున్న ఫొటోలు హల్‌చల్ చేశాయి. అయితే 'ఉరి' మూవీ విడుదలైన తర్వాతే తన లవ్ లైఫ్ గురించి బహిర్గతం చేశాడు విక్కీ. ఒక చాట్ షోలో పాల్గొన్న అతను తాను ప్రేమలో ఉన్నాననీ, 2018లో ఒక పార్టీలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా తామిద్దరం తొలిసారి కలుసుకున్నామనీ అతను చెప్పాడు.
కానీ అతను తమ ప్రేమను వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఆ ఇద్దరూ బ్రేకప్ అయ్యారన్న వార్త అందరినీ విస్మయానికి గురిచేసింది. ఒక డాన్స్ వీడియో ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చిన హర్లీన్ సేఠి, 'బ్రోకెన్ అండ్ బ్యూటిఫుల్' వెబ్ సిరీస్‌లో ప్రదర్శించిన నటనతో అందరి ప్రశంసలూ పొందింది. 2019 ఏప్రిల్ చివరలో విక్కీతో బ్రేకప్ అయిన విషయాన్ని బయటపెట్టింది హర్లీన్.
"హానెస్ట్‌గా చెప్పాలంటే ఈ బ్రేకప్ నన్నేమీ బాధపెట్టడం లేదు. కానీ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ బాధపడుతున్నారు. ఒక వ్యక్తిగా, అందరికీ తమవైన సొంత గుర్తింపులు ఉంటాయి. నేనొక మూవీ స్టార్‌ను ప్రేమించాను. ఇప్పటికీ నన్ను నేను ప్రేమిస్తున్నాను. హర్లీన్ సేఠిగా గుర్తింపు పొందడానికి నేను ఇష్టపడతాను. నేను హర్లీన్ సేఠిని. ఎవరో ఒకతను నా మాజీ బాయ్‌ఫ్రెండ్ అని చెప్పడం కరెక్ట్ కాదనుకుంటాను. ఏం జరిగినా అది మంచికే జరిగిందనుకుంటాను." అని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది హర్లీన్.