English | Telugu
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది.. అతనెవరో త్వరలోనే తెలుస్తుంది!
Updated : Nov 11, 2021
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఎప్పుడూ కాంట్రవర్షియల్ కామెంట్స్ తో న్యూస్ లో నిలిచే ఆమె.. తాజాగా పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
కంగనా రనౌత్ ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుని అందుకున్న సంగతి తెలిసిందే. పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఆమె తాజాగా జాతీయ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమెకి వచ్చే ఐదేళ్లలో మీ ప్రణాళికలు ఏంటి? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి కంగనా బదులిస్తూ.. "పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది. వచ్చే ఐదేళ్లలో నన్ను నేను ఓ తల్లిగా చూసుకోవాలని ఉంది" అని చెప్పి ఆశ్చర్య పరిచింది.
ఇంటర్వ్యూలో 'మీ జీవితంలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారా?' అన్న ప్రశ్నకు కంగనా 'అవునని' సమాధానం చెప్పింది. అంతేకాదు, లైఫ్ పార్టనర్ గురించి ప్రస్తావన రాగా.. 'త్వరలోనే మీ అందరికీ తెలుస్తుంది' అంటూ సమాధానం చెప్పి కంగనా షాక్ ఇచ్చింది.
మొత్తానికి కంగనా మాటలను బట్టి చూస్తే ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని అర్థమవుతోంది. మరోవైపు, కంగనా లైఫ్ లో ఉన్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? ఫైర్ బ్రాండ్ మనస్సు దోచుకున్న ఆ వ్యక్తి ఎవరు? అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.