English | Telugu

అమెరికా నంబ‌ర్ వ‌న్ హార‌ర్ మూవీ ఓటీటీలో రాబోతోంది.. ఊపిరి బిగ‌ప‌ట్టి చూడండి!

డేవ్ డేవిస్‌, మినాషే లుస్టిగ్‌, మాల్కీ గోల్డ్‌మ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన హార‌ర్ ఫిల్మ్ 'ద విజిల్' ఇండియా హ‌క్కుల్ని పిక్చ‌ర్ వ‌ర్క్స్ పొందింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ విడుద‌ల కాబోతోంది. కీత్ థామ‌స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా క‌థ‌ య‌కోవ్ (డేవ్ డేవిస్‌) అనే యువ‌కుడి చుట్టూ న‌డుస్తోంది. చ‌నిపోయిన ఓ వ్య‌క్తి శ‌వానికి కాప‌లాగా ఉండేందుకు నియ‌మితుడైన అత‌ను ఒక‌రాత్రి వేళ ఒక భూతాన్ని ఎలా ఎదుర్కొన్నాడ‌నేది ఇందులోని ప్ర‌ధానాంశం. ఒళ్లు జ‌ల‌దరించే భ‌యాన‌క స‌న్నివేశాల‌తో, సూప‌ర్‌నేచుర‌ల్ హార‌ర్ మూవీగా 'ద విజిల్' రూపొందింది.

పారానార్మ‌ల్ యాక్టివిటీ ఫ్రాంచైజ్‌, ది ఇన్విజిబుల్ మ్యాన్‌, ఇన్‌సిడియ‌స్ ఫ్రాంచైజ్‌, ద ప‌ర్జ్ ఫ్రాంచైజ్‌, హాలోవీన్ ఫ్రాంచైజ్‌, హ్యాపీ డెత్ డే ఫ్రాంచైజ్ స్ప్లిట్‌, గ్లాస్ లాంటి సూప‌ర్బ్ ఫిలిమ్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించిన బ్ల‌మ్‌హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ 'ద విజిల్‌'ను నిర్మించింది. 2021లో రూపొందిన హార‌ర్ ఫిలిమ్స్‌లో నంబ‌ర్ వ‌న్‌గా యుఎస్ఎ టుడే లిస్టులో స్థానం పొందిన 'ద విజిల్‌'కు, రాటెన్ టొమాటోస్‌లో 109 లేటెస్ట్ రివ్యూస్ ద్వారా 90% రేటింగ్ రావ‌డం విశేషం.

"ఆద్యంతం వ్యూయ‌ర్స్‌ను కుర్చీల‌పై మునివేళ్ల‌పై కూర్చోబెట్టే అత్యంత ఉత్కంఠ‌భ‌రిత‌మైన చిత్రం ఇది. భార‌తీయ ప్రేక్ష‌కులు ఈ సినిమాని ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేస్తార‌ని న‌మ్ముతున్నాం. ప్ర‌త్యేకించి హార‌ర్ ఫిల్మ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా పండ‌గ లాంటిది." అని పిక్చ‌ర్ వ‌ర్క్స్ ప్ర‌తినిధి చెప్పారు. జూలై 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒరిజిన‌ల్ ఇంగ్లీష్ వెర్ష‌న్‌తో పాటు హిందీలోనూ ఈ మూవీ విడుద‌ల‌వుతోంది.