English | Telugu

మన బలాన్ని మనం కోల్పోతున్నాం..అసలు లెక్క ఎంత 

మన బలాన్ని మనం కోల్పోతున్నాం..అసలు లెక్క ఎంత 

తారుఖ్ రైనా,,నిఖితా దుత్త  ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సిరీస్ 'ది వేకింగ్ ఆఫ్ ఏ నేషన్(The Waking of a nation)1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలా బాగ్ ఉదంతం నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కుతుండగా రామ్ మద్వని(Ram Madhvani)రచనా దర్శకత్వ బాధ్యలతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సిరీస్ నుంచిట్రైలర్ రిలీజయ్యింది.

ట్రైలర్ చూస్తున్నంత సేపు ఇంతవరకు జలియన్ వాలా బాగ్ కి సంబంధించి ఎవరకి తెలియని నిజాలని చెప్తున్నట్టుగా ఈ సిరీస్ తెరకెక్కించారేమో అనిపిస్తుంది.1913 నాటి మనుషుల వేషధారణ, ప్రవర్తన ఎలా ఉండేదో కూడా ఈ సిరీస్ లో చూపించబోతున్నారని కూడా అర్ధమవుతుంది.సిరీస్ లోని ప్రధాన క్యారక్టర్ చెప్పే డైలాగ్ 'ఇండియాలోని మన సామ్రాజ్యం కుప్పకూలిపోయింది.బ్రిటిష్ ప్రభుత్వమే  జలియన్ వాలా బాగ్ ని మొదలు పెట్టింది.భారతీయులమైన మనం మన బలాన్ని కోల్పోతున్నాం' వంటి సంభాషణలు ఈ సిరీస్ యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాయి.మార్చి 7 నుంచి సోనీ లైవ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

జలియన్ వాలాబాగ్(Jallianwala Bagh)అనేది అమృత్‌సర్(Amrithsar)పట్టణంలో ఒక తోట.1919 ఏప్రిల్ 13 న ఎటువంటి ఆయుధాలు లేకుండా పురుషులు,మహిళలు,పసి పిల్లలు సమావేశమయ్యి భారతదేశ స్వాతంత్రోద్యమం గురించి చర్చలు జరుపుతున్నారు.జనరల్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిషు సైనికులు సమావేశమైన వారిపై తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.పది నిమిషాలపాటు సాగిన ఈ కాల్పులలో 1650 రౌండ్లు ఫైరింగ్ జరగగా,బ్రిటిష్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ 1000 మందికి పైగా మరణించారని  2000 మందికి పైగా గాయపడ్డారని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. 

 

 


 

మన బలాన్ని మనం కోల్పోతున్నాం..అసలు లెక్క ఎంత