English | Telugu

నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది.. ఐదో భర్త కోసం వెతుకుతోంది: నోరు పారేసుకున్న కంగనా!

నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది.. ఐదో భర్త కోసం వెతుకుతోంది: నోరు పారేసుకున్న కంగనా!

బాలీవుడ్‌ నటి, ఎంపి కంగనా రనౌత్‌ చుట్టూ వివాదాలు తిరుగుతుంటాయి. అలాగే వివాదాల చుట్టూ ఆమె తిరుగుతుంటుంది. ఎప్పుడూ ఎవరో ఒకరిపై నోరు చేసుకోవడం కంగనాకు మొదటి నుంచీ అలవాటు. గతంలో ఎన్నోసార్టు ఆమెను వివాదాలు చుట్టుముట్టాయి. అలాగే కొన్నిసార్లు వివాదాలు కొని తెచ్చుకుంది. చాలాసార్లు బాలీవుడ్‌పై విమర్శలు చేసింది. అంతేకాదు, బాలీవుడ్‌ స్టార్స్‌పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే వీలైనప్పుడు సినిమాలు చేస్తోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ నటీనటులపైన నోరు పారేసుకోవడం మాత్రం మానడం లేదు. 

తాజాగా హాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌, హీరోయిన్‌ జెన్నిఫర్‌ లోపెజ్‌ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది కంగనా. ఆమె చేసుకున్న పెళ్లిళ్ల గురించి తప్పుగా మాట్లాడారు. ‘జెన్నిఫర్‌ ఎంతో పేరు, డబ్బు సంపాదించుకున్నారు. కానీ, వివాహ బంధాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. ఎంతో మంది మగాళ్ళతో సంబంధాలు పెట్టుకుంది. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని తాజాగా చివరి భర్తకు విడాకులు ఇచ్చింది. ఇప్పుడు ఐదో భర్త గురించి వెతుకుతోంది. 55 సంవత్సరాల వయసులో కూడా భాగస్వామి కోసం వెతకడం విడ్డూరంగా ఉంది. ఇతర దేశాలవారు భారతీయ వివాహాలను ఎగతాళి చేస్తుంటారు. అలాంటి వారికి జెన్నిఫర్‌ లోపెజ్‌ లాంటివారిని ఉదాహరణగా చూపించాలి. ఎందుకంటే ఇతరదేశాల వారు డేటింగ్‌ యాప్‌లపై ఆధారపడతారు.  భారతీయ సంప్రదాయం దానికి పూర్తిగా విరుద్ధం. మన దేశంలో పెళ్లికి చాలా విలువ ఉంది. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే లోతైన బంధాన్ని ఏర్పరచుకుంటారు’ అంటూ చెప్పుకొచ్చింది.